హీరోగా సుమ త‌న‌యుడు ఎంట్రీ.. మొద‌టి సినిమా ఆ డైరెక్ట‌ర్‌తోనే!

October 30, 2020 at 4:20 pm

సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంద‌రో వార‌సులు వ‌చ్చారు. అందులో కొంద‌రు టాప్ స్థానంలోకి చేరుకుంటే.. కొంద‌రు మాత్రం నిల‌దొక్కుకోలేక‌పోయారు. అయితే ఇప్పుడు మ‌రో వార‌సుడు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. అత‌డు ఎవ‌రో కాదు నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమల త‌న‌యుడు రోషన్ కనకాల.

రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో నటించాడు. అప్పటికి రోషన్ కాస్త చిన్న పిల్లాడు. కానీ, ఇప్పుడు బాగా ఎదిగిపోయాడు. ఇటీవ‌ల యాంక‌ర్ సుమ త‌న త‌న‌యుడితో దిగిన ఫొటోను పోస్ట్ చేయ‌గా.. అది నెట్టింట్లో తెగ వైర‌ల్‌గా మారింది.

అయితే ఇప్పుడు రోష‌న్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. కొత్త దర్శకుడు విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాన్ని రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. మ‌రి రోష‌న్ హీరోగా ఎంత వ‌ర‌కు విజ‌యం సాధిస్తారో చూడాలి.

హీరోగా సుమ త‌న‌యుడు ఎంట్రీ.. మొద‌టి సినిమా ఆ డైరెక్ట‌ర్‌తోనే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts