ఢిల్లీపై సన్​రైజర్స్ ఘ‌న విజ‌యం.. కోహ్లీ సేన‌కు క‌లిసొచ్చిందిగా!

October 28, 2020 at 7:24 am

ఐపీఎల్ 2020లో దుబాయ్ క్రికెట్ స్టేడియం వేదిక‌గా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆల్‌రౌండ్‌ షోతో ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ వార్నర్, వృద్ధిమాన్ సాహా బాదుడుతో ఏకంగా 219 పరుగుల భారీ స్కోరు చేసింది.

220 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఢిల్లీని హైదరాబాద్ బౌలర్లు దారుణంగా దెబ్బతీశారు. ఈ క్ర‌మంలోనే ఢిల్లీ 131 పరుగులకే ఆలౌటైంది. ఫ‌లితంగా సన్‌రైజర్స్‌ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో ఘోర పరాజయాన్ని ఢిల్లీ తన ఖాతాలో వేసుకుంది. ప్లే ఆఫ్స్ ముంగిట ఢిల్లీకి ఇది వరుసగా మూడో ఓటమి కాగా, ఈ విజయంతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది.

అయితే స‌న్‌రైజ‌ర్స్ ఓట‌మి కోహ్లీ సేన‌కు క‌లిసొచ్చింద‌ని చెప్పాలి. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌తో హైదరాబాద్ ఏడు నుంచి ఆరో స్థానానికి ఎగబాకగా.. హ్యాట్రిక్ ఓటములతో ఢిల్లీ రెండు నుంచి మూడుకి పడిపోయింది. దాంతో.. మూడో స్థానంలో ఉన్న బెంగళూరు మెరుగైన నెట్‌ రన్‌రేట్ సాయంతో రెండో స్థానానికి ఎగబాకింది.

ఢిల్లీపై సన్​రైజర్స్ ఘ‌న విజ‌యం.. కోహ్లీ సేన‌కు క‌లిసొచ్చిందిగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts