తల్లిని హత్య చేసి.. తల మొండెం వేరు చేసి.. దారుణం..?

October 24, 2020 at 5:01 pm

నవమాసాలు మోసి ప్రేగు తెంచుకుని జన్మనిచ్చిన తల్లిని పూజించాల్సింది పోయి.. నేటి రోజుల్లో మాత్రం ఏకంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మానవ బంధాల కు రోజురోజుకు అసలు విలువ లేకుండా పోతుంది. ఇక్కడ ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసగా మారిన కొడుకు ఏకంగా కన్నతల్లిని దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

కొల్హాపూర్ మండలం సింగోటం లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సింగోటం లో 65 ఏళ్ల వృద్ధురాలు చంద్రమ్మ తన కొడుకు రాములు తో కలిసి నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే… మద్యానికి బానిసగా మారిన రాముల వృద్ధురాలైన తల్లి దగ్గర మద్యం తాగేందుకు డబ్బులు అడుగుతూ వేధించేవాడు. డబ్బులు ఇవ్వకపోతే విచక్షణరహితంగా దాడి చేసే వాడు. ఈ క్రమంలోనే ఇటీవలే మద్యం తాగేందుకు తల్లి చంద్రమ్మ డబ్బులు ఇవ్వను అని చెప్పడంతో చివరికి విచక్షణా రహితంగా కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. తల మొండెం వేరు చేసి తలను తనతోపాటు తీసుకెళ్ళాడు. ప్రస్తుతం పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు కొడుకు.

తల్లిని హత్య చేసి.. తల మొండెం వేరు చేసి.. దారుణం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts