తస్మాత్ జాగ్రత్త.. హెల్మెట్ లేకపోతే లైసెన్స్ పోద్ధి..?

October 20, 2020 at 5:20 pm

రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలను నడపాలని అధికారులు ఎన్నిసార్లు సూచించినప్పటికీ వాహనదారులు మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యంగా హెల్మెట్ ధరించకుండా… ట్రిబుల్ రైడింగ్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమాదాలు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఎక్కువగా ఉల్లంఘిస్తున్నారు అన్న కారణంతో ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చి వాహనదారులు అందరికీ భారీ షాక్ ఇచ్చింది.

హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యంగా రోడ్డు నిబంధనలను ఉల్లంఘించి బైక్ నడిపే వారి లైసెన్స్ ను మూడు నెలల పాటు నిషేధించాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇక లైసెన్స్ నిషేధం తో పాటు 500 రూపాయల జరిమానా కూడా విధించాలి అని సూచించింది. అయితే ఇప్పటివరకు ఈ సంవత్సరంలో కేవలం బెంగళూరులోనే హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన కేసులు ఏకంగా 20.07 లక్షల నమోదు కావడం గమనార్హం. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించక పోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది.

తస్మాత్ జాగ్రత్త.. హెల్మెట్ లేకపోతే లైసెన్స్ పోద్ధి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts