కొడాలి నానిపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు..

October 19, 2020 at 12:53 pm

ఏపీ మంత్రి కొడాలి నాని ఎప్పుడు చంద్రబాబు, నారా లోకేష్‌లపై విమర్శలు చేస్తారనే సంగతి తెలిసిందే. తాజాగా వరద ప్రాంతాల్లో పర్యటించిన లోకేష్‌పై నాని విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే నాని వ్యాఖ్యలకు టీడీపీ నాయకురాలు దివ్యవాణి కౌంటర్ ఇచ్చారు. ఏమండోయ్ కొడాలి గారు.. పుట్టుకతో బంగారు స్ఫూన్‌తో పుట్టిన వ్యక్తి లోకేశ్ అని,  పార్టీలు మార్చే వ్యక్తి కాదని, వీళ్లకు వాళ్లకు గ్లాసులు మోసిన వ్యక్తి కాదని అన్నారు.

సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారే వ్యక్తి కాదని, ఇవన్నీ ఎందుకని ఆయన యూఎస్‌కు వెళితే… వచ్చే ఆదాయం ఎంతో తెలుసా… 50 లక్షల డాలర్లు సంపాదించుకొనే సత్తా ఉందని, అయినా తనను తాను తగ్గించుకుంటూ.. అందరితో కలిసిపోతూ… పని చేసుకుంటూ వెళుతున్నారని చెప్పుకొచ్చారు.

లోకేశ్‌ను విమర్శించే వారికి ఆవగింజలో అరవయ్యో వంతు అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఎంబీఏ చదివి, ప్రపంచబ్యాంకులో పని చేసిన రికార్డు లోకేశ్ సొంతమని, విజన్ ఉన్న నాయకుడి తనయుడిగా లోకేశ్‌కు కష్టపడే స్వభావం ఉందన్నారు.

కొడాలి నానిపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts