జగన్‌పై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..  

October 11, 2020 at 12:25 pm

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు సీఎం జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టి ప్రజల్ని మాయ చేశారని, జగన్ ఇప్పుడు రాజధానిపై 3 ముక్కల ఆటకు తెరదీశాడని విమర్శించారు. త్వరలో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ముందు ఉన్నాయని, అసలు రైతులు ఏం డ్రెస్ వేసుకోవాలో మంత్రులే నిర్ణయిస్తారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు.

అటు అమరావతి చుట్టుపక్కల అంతా దళిత నియోజకవర్గాలే ఉన్నాయని.. అందుకే దళితులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో రాజధాని ఉండటం జగన్‌కు ఇష్టం లేదన్నారు. గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా అంగీకరించారని గుర్తుచేశారు.

ఇదిలా ఉంటే అమరావతి రైతుల నిరసనలు ఆదివారం నాటికి 3 వందల రోజులకు చేరాయి. ఈ సందర్భంగా అమరావతి జేఏసీ మహిళా ర్యాలీకి పిలుపు ఇచ్చింది. బీఆర్టీఎస్ రోడ్డులోని శారద కాలేజీ నుంచి ర్యాలీ నిర్వహించారు. అయితే మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అన్నారు.

జగన్‌పై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..  
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts