ఏపీ ప్రభుత్వ సలహాదారులపై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు…

October 13, 2020 at 1:31 pm

ఏపీ ప్రభుత్వ సలహాదారులపై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే రాజధానిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కూడా వర్ల స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…‘‘ముఖ్యమంత్రి గారూ! ఎంతో ప్రజా ధనాన్ని వెచ్చించి, ఎటువంటి మేధావులను సలహా దారులుగా నియమించారో మీకు తెలుస్తుందా? రాయలసీమకు, అమరావతి కంటే విశాఖపట్నం దగ్గరటా, నిజమా సార్?బూటకపు ప్రభుత్వాన్ని, ఊహాలోకంలో పరిపాలిస్తున్న అబద్ధపు ముఖ్యమంత్రిగా చరిత్ర తిరుగ రాస్తారా ఏమిటి? అడుగులు జాగ్రత్త! ’’ అంటూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే అమరావతి ఉద్యమంలో ఉన్నది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని… అక్కడి నిజమైన రైతులు మీరు ఉద్యమం ఎప్పుడు వదిలేస్తారా అని ఎదురుచూస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ‘అమరావతిలోనే రాజధాని ఉండాలని వచ్చే ఎన్నికల వరకూ పోరాడు… మీరెన్ని ఆటంకాలు సృష్టించినా అక్కడ జరిగే అభివృద్ది జరుగుతుందని, త్వరలోనే కొన్ని పనులకు టెండర్లు కూడా పిలుస్తున్నామని, రైతులకు అన్యాయం జరగట్లేదని అన్నారు.

ఏపీ ప్రభుత్వ సలహాదారులపై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts