బాపట్ల టీడీపీ అధ్యక్షుడుకి కరోనా…మరో మాజీ ఎమ్మెల్యేకు కూడా…

October 20, 2020 at 10:45 am

కరోనా విజృంభణ ఆగడం లేదు. ఏపీలో కరోనా వరుసగా రాజకీయ నేతలని ఎటాక్ చేస్తుంది. ఇప్పటికే పలువురు వైసీపీ, టీడీపీ నేతలకు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరికొందరు టీడీపీ నేతలకు కరోనా సోకింది. బాపట్ల టీడీపీ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు కరోనా వచ్చింది. అలాగే కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, దామచర్ల పూర్ణచంద్రరావులకు కరోనా పాజిటివ్ అని తేలింది. పోతుల రామారావు, దామచర్ల పూర్ణచంద్రరావు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

అలాగే ఎమ్మెల్యే ఏలూరి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక కరోనా బారిన పడిన నేతలను టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించారు. కాగా, ఇటీవలే ఏలూరికి బాపట్ల పార్లమెంట్ పగ్గాలు అప్పగించారు. ఈ క్రమంలోనే ఆయన వరుసగా నియోజకవర్గ వారీగా నేతలతో సమావేశం అవుతున్నారు.

 

బాపట్ల టీడీపీ అధ్యక్షుడుకి కరోనా…మరో మాజీ ఎమ్మెల్యేకు కూడా…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts