టీడీపీ ఎమ్మెల్యేకు సంకెళ్ళు…వైసీపీపై ఫైర్

October 29, 2020 at 12:13 pm

ఇటీవల రాజధాని రైతులకు పోలీసులు సంకెళ్ళు వేసుకుని తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇక దీనిపై టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్..వినూత్నంగా నిరసన తెలిపారు. చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. రైతులు, దళితులను అవమానించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. రైతు భారత దేశానికి వెన్నెముకలాంటివాడని, అలాంటి రైతుల చేతులకు బేడీలు వేసి జైలుకు తీసుకువెళ్లడం అత్యంత దారుణమని గద్దె రామ్మోహన్ అన్నారు.

రాజధాని కోసం కేవలం ఒక సామాజిక వర్గం ఆందోళన చేస్తోందని, దళితులు లేరని ప్రభుత్వం చెబుతోందని అన్నారు. కానీ అరెస్టు చేసిన రైతుల్లో దళితులు ఉన్నారని అధికారులే చెబుతున్నారని, అంటే ప్రభుత్వం చెప్పేదానికి.. చేసేదానికి పొంతన లేదని విమర్శించారు. భారత దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి ఆరాచకం లేదని ఫైర్ అయ్యారు.

టీడీపీ ఎమ్మెల్యేకు సంకెళ్ళు…వైసీపీపై ఫైర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts