రైతులకి కేసీఆర్ గుడ్ న్యూస్..!

October 23, 2020 at 5:43 pm

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మొక్కజొన్న రైతులకు శుభవార్త తెలియజేశాడు. మొక్కజొన్నసాగుకు కూడా మద్దతు ధర అందించే విధంగా కొనుగోలు చేస్తామని తెలియజేశారు. రైతుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా క్వింటాళ్ల మొక్కలకు రూ.1850 ధరతో కొనుగోలు చేస్తామని స్పష్టంగా తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పై సమీక్ష నిర్వహించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

మొక్కలకు మద్దతు ధర వచ్చే అవకాశాలు లేవని తెలియజేసినా కూడా రైతులు మొక్కల సాగు వేయడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కల సాగు వేయొద్దు అని చెప్పినప్పటికీ కూడా రైతులు వేశారు కాబట్టి కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదు అని అన్నారు. కానీ రైతులు నష్ట పోకూడదు అన్న ఒక్క కారణంతో ప్రభుత్వం నష్టాన్ని భరించడానికి సిద్ధపడి మొక్కలను కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కెసిఆర్ తెలిపాడు.

రైతులకి కేసీఆర్ గుడ్ న్యూస్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts