తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర ప్రభుత్వం..?

October 22, 2020 at 5:07 pm

ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం పై మోడీ సర్కార్ ప్రశంసల వర్షం కురిపించింది. తెలంగాణలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఆన్లైన్ ఆడిట్ విధానం పై ప్రశంసలు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. ఆన్లైన్ ఆడిట్ విధానంలో తెలంగాణ ప్రభుత్వం నెంబర్ వన్ గా ఉంది అంటూ తెలిపింది. ఇక ఇటీవలే తెలంగాణలోని గ్రామపంచాయతీల పనితీరును సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం… దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో 25% గ్రామ పంచాయితీలలో ఆన్లైన్ ఆడిట్ పూర్తి చేయడం పై ప్రశంసలు కురిపించింది.

దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా గ్రామపంచాయతీ ఆన్లైన్ ఆడిట్ విధానంలో తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా సమన్వయం చేసుకుని ఆన్లైన్ ఆడిట్ నిర్వహించాలని.. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరో 25 శాతం ఆన్లైన్ ఆడిట్ పూర్తి చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ కె ఎస్ సేథీ తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాలు ఇంకా పంచాయతీల ఆడిట్ విషయంలో ప్రారంభదశలోనే ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే 25% గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిట్ పూర్తి చేయడం గొప్ప విషయం అంటూ ప్రశంసించారు ఆయన.

తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర ప్రభుత్వం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts