రాజ‌మౌళికి వార్నింగ్ ఇచ్చిన ఎంపీ.. ఏం జ‌రిగిందంటే?

October 27, 2020 at 12:30 pm

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీంగా క‌నిపించ‌నున్నారు. ఇక మొన్న కొమరం భీమ్ జయంతి కానుకగా ఎన్టీఆర్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్‌.

అయితే ఈ టీజ‌ర్ చివ‌ర్లో భీమ్ పాత్రకు ముస్లిం టోపీ పెట్టించాడు రాజమౌళి. దానిపై కాంట్రవర్సీ చెలరేగుతుంది. ఇప్పుడు ఇదే విష‌యంపై ఎంపీ సోయం బాపు రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో భీమ్‌ పాత్రకు పెట్టిన టోపీని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదని అలానే విడుదల చేస్తే థియేటర్లను తగులబెట్టే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు.

కలెక్షన్ల కోసం మా ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించబోమని రామౌళిపై మండిప‌డ్డారు. నిజాంకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని సోయం పేర్కొన్నాడు. భీమ్‌ని చంపిన వాళ్ల టోపీని ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనని.. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని చుర‌క‌లు అంటించారు. మ‌రి దీనిపై జ‌క్క‌న్న ఎలా స్పందిస్తారో చూడాలి.

రాజ‌మౌళికి వార్నింగ్ ఇచ్చిన ఎంపీ.. ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts