రూ.10 కే బిర్యానీ.. ఎగ‌బ‌డ్డ జ‌నం.. చివ‌ర్లో దిమ్మ‌తిరిగే షాక్‌?

October 19, 2020 at 3:26 pm

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ఇప్ప‌టికే ల‌క్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మాయ‌దారి క‌రోనా ఎప్పుడు, ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో కూడా అర్థం కావ‌డం లేదు. దీంతో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నారు. అయితే తాజాగా క‌రోనా భ‌యాన్ని ప‌క్క‌న పెట్టి.. బిర్యానీ కోసం జ‌నాలు ఎగ‌ప‌డ్డారు.

ఈ ఘ‌ట‌న తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విరుదునగర్ జిల్లాలో 10 రూపాయలకే బిర్యానీ అని ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో సుమారు 4 కిలోమీటర్ దూరానికి జనం క్యూలు కట్టారు. క‌నీసం మాస్క్‌‌లు ధ‌రించకుండా, భౌతిక దూరం పాటించ‌కుండా జ‌నాలు ఎగ‌ప‌డ‌డంతో.. పోలీసులు రంగంలోకి దిగారు.

ఎంద వారించినా జ‌నాలు మాత్రం అదుపులోకి రాలేదు. దీంతో చివ‌ర‌కు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అనంత‌రం ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. బిర్యానీ షాప్ యజమానికి జరిమానా విధించి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. అయితే ఇంత‌కు ముందు కూడా త‌మిళ‌నాడులో ఇలాంటి ఘ‌ట‌న‌లే జ‌రిగాయి. మొత్తానికి తమిళనాడు సర్కార్‌కి బిర్యానీ అమ్మకాలు తలనొప్పిగా మారుతున్నాయి.

రూ.10 కే బిర్యానీ.. ఎగ‌బ‌డ్డ జ‌నం.. చివ‌ర్లో దిమ్మ‌తిరిగే షాక్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts