క‌ట్నం కోసం భార్యను హత మార్చిన భర్త..!

October 18, 2020 at 5:34 pm

రోజులు మారుతున్న కానీ… మహిళలపై జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్టలేదు. ఉత్తర ప్రదేశ్ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కట్నం కోసం తన భార్యను హతమార్చిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే జిల్లాలోని ఖ‌టౌలి ప‌ట్ట‌ణంలో ఫిరోజ్, ఖ‌ష్‌నుమా ఇద్దరు 10 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం కూడా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా పట్టణంలో నివాసముంటూ వారి జీవనం కొనసాగిస్తున్నారు .

ఇక వీరిద్దరి వివాహం జరిగిన అప్పటి నుంచి ఇప్పటివరకు ఆరిఫ్ ఖ‌ష్‌నుమాను కట్నం కోసం వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే నేడు ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. చిన్న గొడవ కాస్త పెద్దగా మారి చివరికి ఆరిఫ్ తుపాకితో తన భార్య అయిన ఖ‌ష్‌నుమాపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఖ‌ష్‌నుమా అక్కడికక్కడే మృతి చెందింది. ఇక వెంటనే అక్కడే ఉన్న స్థానికుల సమాచారం మేరకు పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు ఆస్పత్రికి తరలించారు. ఇక స్థానికులు పోలీసు అధికారులకు సమాచారం అందజేసిన వెంటనే అక్కడినుంచి పారిపోయాడు. ప్రస్తుతం పోలీసు అధికారులు పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

క‌ట్నం కోసం భార్యను హత మార్చిన భర్త..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts