ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య..

October 27, 2020 at 6:44 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త అదుపులోకి వచ్చినట్టుగా కనబడుతోంది. తాజా గడచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 74 757 శాంపిల్స్ పరీక్షించగా అందులో 2901 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 808 930 కి చేరుకున్నాయి. మరోవైపు కలిసి 24 గంటల్లో 4362 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 27,300 కరోనా కేసులు యాక్టీవ్ గా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 18 మంది మరణించారు. దీంతో కరోనావైరస్ తో మరణించిన వారి సంఖ్య 6625 కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 555 కేసులు నమోదవగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts