సరికొత్త యోధురాల్ని ప‌రిచ‌యం చేసిన వాల్ట్ డిస్నీ సంస్థ..!

October 22, 2020 at 5:44 pm

తాజాగా రయా అండ్ ది లాస్ట్ డ్రాగన్ ట్రైలర్ వచ్చేసింది. వాల్ట్ డిస్నీ సంస్థ కొత్త యోధురాల్ని ప‌రిచ‌యం చేయ‌నున్న‌ది. ర‌యా అండ్ ది లాస్ట్ డ్రాగ‌న్ సినిమా ట్రైల‌ర్‌ను ఆ సంస్థ రిలీజ్ చేసింది. 2021 మార్చిలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఫ్రోజ‌న్‌, మోనా చిత్రాల‌ను తీసిన స్టూడియోనే ఈ సినిమాను కూడా రూపొందిస్తున్న‌ది. కుముంద్ర లోకంలో మాన‌వులు, డ్రాగ‌న్లు క‌లిసే జీవిస్తుంటాయి. కానీ, ఓ దుష్ట శ‌క్తి వ‌ల్ల అంతా తారుమారు అవుతుంది. మాన‌వుల‌ను ర‌క్షించే ప్రయత్నంలో డ్రాగ‌న్లు ప్రాణాలు కోల్పోతారు. మళ్లీ 500 ఏళ్ల‌ తరువాత ఆ దుష్ట‌శక్తీ మళ్ళి వ‌స్తుంది.

దింతో యోధురాలు ర‌యా ఒంట‌రిగా పోరాడి ఆ దుష్టశక్తుల్ని ఎదుర్కొంటుంది. అద్భుత‌మైన గ్రాఫిక్స్ వ‌ర్క్‌ తో ఈ సినిమాను డిస్నీ యానిమేష‌న్ సంస్థ రూపొందిస్తున్న‌ది. కెల్లీ మేరీ ర‌యా పాత్ర‌కు స్వ‌రాన్ని అందించారు. రయా అండ్ ద లాస్ట్ డ్రాగన్ ఫస్ట్ లుక్ విడుదుల చేసింది నేడు డిస్నీ సంస్థ. వ‌చ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా రిలీజ్ కానున్న‌ది.

సరికొత్త యోధురాల్ని ప‌రిచ‌యం చేసిన వాల్ట్ డిస్నీ సంస్థ..!
0 votes, 0.00 avg. rating (0% score)