
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయంలోని ప్రసాదాలు తయారు చేసే వకుళామాత పోటులో ప్రమాదం సంభవించింది. పులిహోర ప్రసాదం కోసం చింతపండు వేడి చేస్తున్న సమయంలో బాయిలర్ పేలి ప్రమాదం సంభవించింది. ఇక ఈ సంఘటనలో మొత్తం ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 40 మంది కార్మికులు ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు.
ప్రమాద సంఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అవ్వగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే తిరుపతిలోని అశ్విని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.