
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యదర్శిగా సేవలు అందించిన అశోక్ సింఘాల్ బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయనను వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా వైసీపీ ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఏపీ ధర్మారెడ్డిని టీటీడీ ఈవో నియమించింది. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డికి అశోక్ సింఘాల్ ఆదివారం బాధ్యతలను అప్పగించారు.
ఇదిలా ఉండగా ఈవో సింఘాల్ బదిలీపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మధ్య వివాదాలు నెలకొన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆయనపై బదిలీ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ నేతలు ఆందోళన చేపట్టడం విషయం తెలిసిందే. సింఘాల్ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి తిరుమలలో అనేక వివాదాలు చోటుచేసుకున్నాయి. శ్రీవారి నగల మాయం తదితర ఉదంతాలు వెలుగులోకి రావడం గమనార్హం.