లాక్‌డౌన్‌లో ఆ చిత్రం మ‌హేష్‌ను తెగ భ‌య‌పెట్టింద‌ట‌‌?

October 6, 2020 at 8:39 am

క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ రావ‌డంతో సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు సైతం ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఎప్పుడూ షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉంటే సినీ తార‌ల‌కు లాక్‌డౌన్ కార‌ణంగా బోలెడంత ఫ్రీ టైమ్ దొరికింది. ఈ క్ర‌మంలోనే సెల‌బ్రెటీలు ఇంటి స‌భ్యుల‌తో గ‌డ‌ప‌డం, ఇంటి ప‌నులు చేయ‌డం, వంట‌లు చేయ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. అయితే మ‌రోవైపు లాక్‌డౌన్ కాలంలో.. డిజిటల్ కంటెంట్ కు ప్రాధాన్యం బాగా పెరిగిందని చెప్పాలి.

సామాన్యులే కాకుండా సెల‌బ్రెటీలు సైతం డిజిటల్ కంటెంట్ మ‌క్కువ చూపుతున్నారు. అలా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ లాక్ డౌన్ లో చాలా వరకు డిజిటల్ కంటెంట్ ను వీక్షించారు. అయితే అందులో ఓ చిత్రం మ‌హేష్‌ను తెగ భ‌య‌పెట్టింద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మ‌హేష్ బాబే అభిమానులతో పంచుకున్నారు.

తాను ఇప్పటి వరకు హర్రర్ జానర్ లో ఎన్నో చిత్రాలు చూసా. కానీ, నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఈ `సోషల్ డిలేమా` అనే చిత్రం మాత్రం అన్నిటికన్నా ఎక్కువ భయపెట్టింది అని.. ఈ సినిమా ఇచ్చిన థ్రిల్ ఇప్పటికీ తాను మ‌ర్చిపోలేక‌పోతున్నా అని చెప్పిన‌ మహేష్.. ప్రతీ ఒక్కరూఈ చిత్రాన్ని చూడాల‌ని తెలిపారు. కాగా, మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ త్వ‌ర‌లోనే అమెరికాలో ప్రారంభంకానుంది.

 

లాక్‌డౌన్‌లో ఆ చిత్రం మ‌హేష్‌ను తెగ భ‌య‌పెట్టింద‌ట‌‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts