తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలే..!

October 16, 2020 at 8:14 pm

ఇప్పటికే తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెదర్ బులెటిన్ విడుదల చేసింది. రాగల 24 గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అందులో పేర్కొంది.

రేపు, ఎల్లుండి పలుచోట్ల మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 19 నాటికి మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందంది. ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గరలో తూర్పు మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని, దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు చెప్పారు.

అటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ తెలిపింది.

తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts