టిక్ టాక్ లో మైనర్ బాలుడు ప్రేమ.. చివరిలో ట్విస్ట్.,?

October 8, 2020 at 4:06 pm

ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో ప్రేమ చిగురించి చివరికి అమ్మాయిలను నట్టేట ముంచుతున్న ఘటనలు ఎన్నో తెరమీదకి వస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వివిధ యాప్స్ ద్వారా అమ్మాయిలను టార్గెట్ చేసి చివరికి మాయమాటలతో ప్రేమలోకి దించి… చివరికి ముఖం చాటేస్తున్నారు ఎంతోమంది మోసగాళ్లు. ఇక్కడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా పీలేరు పట్టణానికి మంజుల అనే యువతి.. టిక్ టాక్ తో ఓ బ్రహ్మయ్య అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. కొన్నాళ్ళకి పరిచయం కాస్తా ప్రేమగా మారి పోయింది.

చివరికి ఇప్పుడు తాను ప్రేమించిన వ్యక్తి తనను శారీరకంగా వాడుకొని మొహం చాటేశాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసుతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఎందుకంటే సదరు యువతి గతంలో కూడా ఓ యువకుడిపై ఇదే ఆరోపణలతో కేసు నమోదు చేసింది. ఇప్పుడు బ్రహ్మయ్య అనే 17 ఏళ్ళ యువకుడిపై కేసు పెట్టి తన ప్రియుడితో పెళ్లి జరిపించాలి అంటూ పోలీసులను కోరింది. ఇక 18 ఏళ్లు కూడా నిండని ఆ యువకుడి పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక పోలీసులు సతమతమవుతున్నారు.

టిక్ టాక్ లో మైనర్ బాలుడు ప్రేమ.. చివరిలో ట్విస్ట్.,?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts