బ‌ర్త్‌డే రోజునే ప్ర‌భాస్ పెళ్లిపై ప్ర‌క‌ట‌న‌..!

October 18, 2020 at 1:59 pm

కృష్ణంరాజు వార‌సుడిగా టాలివుడ్‌లో అడుగుపెట్టిన త‌న‌కంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు ప్ర‌భాస్‌, ఎవ‌రూ అందుకోలేని స్థాయికి ఎదిగారు. వ‌య‌స్సు పెరుగుతున్నా ఈ స్టార్ ఇంకా పెళ్లి ఊసు ఎత్త‌డం లేదు. ఇప్ప‌టికే రానా, నితిన్‌, నిఖిల్‌, నాని త‌దిత‌ర యంగ్‌స్ట‌ర్లు బ్యాచిల‌ర్ లైఫ్‌కు బాయ్ చెప్పేశారు. ప్ర‌భాస్ మాత్రం దీనిపై ఏ విధంగా స్పందించ‌డం లేదు. గ‌తంలో అనుష్క‌నే పెళ్లి చేసుకుంటార‌నే పుకార్లు కూడా జోరుగా షికారు చేశాయి తెలుగు చిత్ర‌సీమ‌లో. వాటిపైనా స్పందించ‌లేదు ఈ యువ హీరో. అయితే తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ‌ ఈనెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అందుకు సంబంధించే అంశాల‌ను అభిమానుల‌కు వెల్ల‌డించి ఆశ్చ‌ర్యంలో ముంచాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా.. గతేడాది పుట్టినరోజున సంద‌ర్భంగానూ ప్ర‌భాస్ పెళ్లి వార్తను ఆయ‌న‌ కుటుంబ సభ్యులు చెబుతారని అందరూ అనుకున్నా అది సాధ్యపడలేదు. అయితే ఈ ఏడాది కచ్చితంగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ వస్తుందని తెలుస్తోంది. కృష్ణంరాజు ఈ విషయంపై క్లారిటీ ఇస్తారని స‌మాచారం. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, వధువు ఎవరు అనే విషయంపై ఆయన మాట్లాడతారని, ప్రస్తుతానికి ఆ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచారని అంటున్నారు. అదే విధంగా ప్ర‌భాస్ భ‌విష్య‌త్ కాలంలో చేప‌ట్ట‌బోయే సినిమాల గురించి ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్ప‌టికే ఇదుగో పెళ్లి.. అదుగో పెళ్లి సోష‌ల్‌మీడియాలో ప్ర‌భాస్ వివాహంపై వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌నైనా ఆ యువ‌హీరో వాటికి చెక్ పెడ‌తారేమో చూడాలి మ‌రి.

బ‌ర్త్‌డే రోజునే ప్ర‌భాస్ పెళ్లిపై ప్ర‌క‌ట‌న‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts