ఏపీ స‌ర్కార్‌పై ప్ర‌ముఖ నిర్మాత‌ ఫైర్‌

October 13, 2020 at 5:44 pm

అమ‌రావ‌తి రాజ‌ధాని అంశం రోజుకో మ‌లుపు తిరుగుతున్న‌ది. ఇప్ప‌టికే మూడు రాజ‌ధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చ‌ట్టం ర‌ద్దు అంశాల‌పై హైకోర్టులో అనేక పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. సుమారు 229 పిటిష‌న్లు దాఖ‌లైన‌ట్లు ఇటీవ‌లే ద‌ర్మాస‌నం ప్ర‌క‌టించింది. అదీగాక రాజ‌ధాని అంశానికి సంబంధించి కేసుల‌ను రోజువారీగా విచార‌ణ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. స‌రిగ్గా రాజ‌ధాని అంశంపై తెలుగు సినీ ప‌రిశ్ర‌మంలో అగ్ర నిర్మాత‌గా పేరుపొందిన అశ్వ‌నీద‌త్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏకంగా త‌న‌కు న్యాయం చేయాలంటూ హైకోర్టును ఆశ్ర‌యించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళ్లితే..

ఏపీలోని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు విస్త‌ర‌ణ‌కు నిర్మాత అశ్వ‌నీద‌త్ త‌న భూమిని ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ఏపీ ప్ర‌భుత్వం అమ‌రావ‌తిలో వేరొక స్థ‌లాన్ని కేటాయించింది. అయితే అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూడురాజ‌ధానుల అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. అదీగాక అందుకు సంబంధించిన సీఆర్‌డీఏ చ‌ట్టాన్ని కూడా ర‌ద్దు చేసింది. ఈ నేప‌థ్యంలోనే అశ్వ‌నీద‌త్ కోర్టును ఆశ్ర‌యించారు. ఏపీ ప్ర‌భుత్వం త‌న‌కు అన్యాయం చేసింద‌ని కోర్టుకు విన్న‌వించుకున్నారు. త‌న‌కు ఏడాదిగా భూమి లీజుకు సంబంధించిన డ‌బ్బుల‌ను కూడా ఇవ్వ‌డం లేద‌ని వివ‌రించారు. అదీగాక భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం త‌న‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని, ఆ మేర‌కు ప్ర‌భుత్వానికి ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని కోర్టుకు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు చీఫ్ జ‌స్టిస్, దీనిపై కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌బుత్వం, మున్సిప‌ల్‌, సీఆర్డీఏకు ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా కేసును న‌వంబ‌ర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

ఏపీ స‌ర్కార్‌పై ప్ర‌ముఖ నిర్మాత‌ ఫైర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts