పుష్ఫ సినిమాలో సునిల్‌కు ప్ర‌త్యేక పాత్ర‌..?

October 11, 2020 at 10:35 am

తెలుగు చిత్ర‌సీమ‌లో క‌మెడియ‌న్ గా సునిల్ త‌న‌దైన ముద్ర‌వేసుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగారు. అటు త‌రువాత హీరోగా కూడా సినిమాలు చేసి కొన్ని‌విజ‌యాల‌ను అందుకున్నారు. అయితే ఆశించిన‌స్థాయిలో హీరోగా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో తిరిగి క‌మెడీయ‌న్‌గా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఇప్ప‌టికే అరవింద సమేత సినిమాతో సునీల్ మళ్ళీ కమెడియన్ గా టర్న్ అయ్యాడు. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కూడా సునీల్ చిన్న పాత్రలో క‌నిపించి మెప్పించాడు.

ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు పుష్ప సినిమాలో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడ‌ట‌. అల వైకుంఠపురములో సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్ లో అల్లు అర్జున్ పుష్ఫ‌ సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ ఊర మాస్ పాత్రలో నటిస్తున్నాడని స‌మాచారం. ఇక స్టైలిష్ స్టార్ స‌ర‌స‌న రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో సునీల్ కూడా ప్ర‌త్యేక‌పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తున్న‌ది. ఆ పాత్ర కోసం సునిల్‌ను ఏకంగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ రెక‌మెండ్ చేయ‌డం కొస‌మెరుపు. సుక్కు సినిమాలో త్రివిక్రం ఇంటరాక్షన్ ఏంటని అనుకోవచ్చు. కానీ సునీల్, త్రివిక్రం ఇద్దరు మంచి స్నేహితులే కాక‌, ఒకే రూమ్ మెట్స్ అని అంద‌రికీ తెలిసిందే. మరి సునీల్ పుష్పలో ఎలాంటి హంగామా చేస్తాడో చూడాలి. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న పుష్ప సినిమాలో చాలా సర్ ప్రైజులు ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. రంగస్థలం తర్వాత చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

పుష్ఫ సినిమాలో సునిల్‌కు ప్ర‌త్యేక పాత్ర‌..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts