రంగ‌మార్తాండాపై మ‌న‌సుమార్చుకున్న కృష్ణ‌వంశీ..!

October 17, 2020 at 7:59 am

తెలుగు చిత్ర‌సీమ‌లో ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీకి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. కుటుంబ క‌థా చిత్రాల‌ను, ఆ భావోద్వేగాల‌ను చూపించ‌డంలో ఆయ‌న‌ది అందెవేసిన చేయి. అంతేకాదు విల‌క్ష‌ణ‌త‌కూ ఆయ‌న పెట్టిన పేరు. సింధూరం, అంత‌పురం, నిన్నెపెళ‌డ‌తా.. చంద‌మామ వంటి సినిమాలు ఆయ‌న కెరీర్‌లో మైలురాళ్లుగా నిలుస్తాయి. కానీ వంశీ చాలా కాలంగా హిట్టును కొట్ట‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారు. గోవిందుడు అంద‌రివాడే తీసి ఆక‌ట్టుకోలేక‌పోయారు. అటు త‌రువాత జెండాపై క‌పిరాజు త‌దిత‌ర చిత్రాలు తీసినా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయారు. వ‌రుస ప్లాఫులతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. మ‌రోవైపు కృష్ణ‌వంశీ ప‌ని అయిపోయింద‌ని ప్ర‌చారం సాగుతున్న‌ది సినీజ‌నాల్లో.

ఈ నేప‌థ్యంలోనే ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాల‌నే క‌సితో క‌థ‌ను సిద్ధం చేసుకున్నార‌ట కృష్ణ‌వంశీ. ప్ర‌స్తుతం న‌ట‌సామ్రాట్ అనే మ‌రాఠి సినిమాను రంగ‌మార్తాండా పేరుతో తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ప్ర‌కాష్‌రాజ్‌, ర‌మ్య‌కృష్ణ వంటి ప్ర‌ముఖ న‌టీన‌టుల‌ను కీల‌క పాత్ర‌ల కోసం తీసుకున్నారు. అదేవిధంగా బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీ షోతో పాపులరైన యాంకర్ అనసూయ సైతం కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టిన అన‌సూయ రంగ మార్తండలో దేవ‌దాసీగా క‌నువిందు చేయ‌నుంద‌ట‌. ఏకంగా అనసూయపై ప్ర‌త్యేక పాట‌ను కూడా ప్లాన్ చేశార‌ట కృష్ణవంశీ. ఇక ఈ చిత్రానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం లాక్ డౌన్ ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఫైనల్ షెడ్యూల్ ఒకటి మిగిలే ఉంది. త్వ‌ర‌లోనే దానిని పూర్తి చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఎంతో ఆశగా ఈ సినిమాను థియెటర్‌లో విడుదల చేద్దామని అనుకున్న కృష్ణ‌వంశీ ప్ర‌స్తుతం మ‌న‌సు మార్చుకున్నార‌ట‌. ఈ కరోనా వల్ల అది కుదిరేలా లేద‌ట‌. కారణం కరోనా రీత్యా సినిమా హాళ్లకు ఇప్పుడప్పుడే నార్మల్ పరిస్థితి వచ్చేలా కనిపించట్లేదు. ప్రేక్షకులు పూర్తిగా థియేటర్ల వైపుకు రావాలంటే ఇంకో రెండు మూడు నెలలు పట్టేలా ఉంది. దీంతో సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.మ‌రి చివ‌ర‌కు ఏం చేస్తారో చూడాలి మ‌రి. ‌

రంగ‌మార్తాండాపై మ‌న‌సుమార్చుకున్న కృష్ణ‌వంశీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts