ర‌వితేజ్ ఖిలాడీ.. ఫ‌స్ట్‌లుక్ అదిరెన్‌

October 18, 2020 at 10:51 am

తెలుగు చిత్ర‌సీమ‌లో ర‌వితేజ‌కు ప్ర‌త్యేక స్థాన‌ముంది. క్యారెక్ట‌ర్ అర్టిస్టుగా అడుగుపెట్టినా అంచెలంచెలుగా ఎదిగా మాస్ మ‌హారాజుగా పేరు సంపాదించుకున్నాడు. యువ‌త‌రం హీరోల రాక‌తో కాస్తా వెన‌క‌బ‌డ్డాడు. మ‌రోవైపు చేస్తున్న సినిమాలు కూడా వ‌ర‌సగా ప్లాప్ అవుతుండ‌డంతో ఈ స్టార్ ప్రస్తుతం స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఎలాగైనా హిట్టును కొట్టి ఇండ‌స్ట్రీలో త‌న స్టామినాను చాటాల‌ని చాలా కాలంగా ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకే సైకో థ్రిల్ల‌ర్ రాక్ష‌స‌న్ మూవీని తెలుగులో బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో రీమేక్ చేసి హిట్టు కొట్టిన డైరెక్ట‌ర్ ర‌మేశ్‌వ‌ర్మ‌తో జ‌త‌క‌ట్టాడు. ఆ చిత్రానికి ఖిలాడీగా పేరును ప్రకటించాడు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. రవితేజ.

ఇదిలా ఉండ‌గా.. థ్రిల్లర్‌తో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న రమేష్‌వర్మ ఈ చిత్రాన్ని కూడా థ్రిల్లర్ కథాంశంతోనే చేయబోతున్నాడని సమాచారం. ఓ తమిళ హిట్ ఫిల్మ్ ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. అదీగాక మాస్ మహారాజా తొలిసారి థ్రిల్లర్ మూవీ చేస్తుండ‌డంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీలో రవితేజకు జోడిగా మీనాక్షీ చౌదరి, డింపుల్ హయాతి నటిస్తున్నారు.  ఈ సినిమాను హవీష్ ప్రొడక్షన్స్ .. బాలీవుడ్‌కి చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనుండ‌గా, లాక్‌డౌన్ కు ముందే పూజా కార్యక్రమాలు పూర్తి చేసి మూవీకి క్లాప్ కొట్టినా ఆ త‌రువాత రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ఇటీవ‌ల మూవీ ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌డంతో పాటు రెగ్యుల‌ర్ షూటింగ్ను సైతం ప్రారంభించారు. ప్ర‌స్తుతం రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తోంది. గోపిచంద్ మలినేని దర్శకుడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ర‌వితేజ్ ఖిలాడీ.. ఫ‌స్ట్‌లుక్ అదిరెన్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts