#ఎన్టీఆర్‌30లో హీరోయిన్‌ను ఫిక్స్ చేసిన త్రివిక్ర‌మ్‌?

October 19, 2020 at 10:17 am

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ త్వ‌ర‌లోనే పూర్తి కానుంది. ఇక ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో త‌న నెక్స్ట్ సినిమా చేయ‌నున్నాడు. ఇది ఎన్టీఆర్‌కు 30వ సినిమా.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. అమెరికా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా అక్కినేని వారి కోడ‌లు స‌మంత‌ను ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే త్రివిక్ర‌మ్ స‌మంత‌కు క‌థ చెప్ప‌గా.. ఆమె గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. ఇక మ‌రో హీరోయిన్‌ను కూడా త్వ‌ర‌లోనే త్రివిక్ర‌మ్ ఎంపిక చేయ‌నున్నార‌ట‌. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే.. మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది. కాగా, గ‌తంలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో స‌మ‌యంలో హీరోయిన్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

#ఎన్టీఆర్‌30లో హీరోయిన్‌ను ఫిక్స్ చేసిన త్రివిక్ర‌మ్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts