అమెరికాలో #ఎన్టీఆర్‌30.. భారీ ప్లాన్‌లో త్రివిక్ర‌మ్‌?

October 18, 2020 at 8:59 am

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా క‌నిపించ‌నున్నాడు. లాక్‌డౌన్ కారణంగా అన్నీ ఆగిపోయినట్టే టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే ఇటీవ‌ల ప్ర‌భుత్వం స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో.. మ‌ళ్లీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభ‌మైంది.

ఇప్ప‌టికే 80 శాతం పూర్తి అయిన ఈ సినిమా షూటింగ్‌.. మ‌రికొన్ని రోజుల్లో పూర్తి కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఇది ఎన్టీఆర్‌కు 30వ చిత్రం. ఇప్ప‌టికే వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అరవింద సమేత వీరరాఘవ సూప‌ర్ హిట్ అయింది. ఇప్పుడు మ‌రోసారి వీరి కాంబో కుద‌ర‌డంతో.. ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు.

అయితే ఈ చిత్రం గురించి ఓ లేటెస్ట్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. రాయలసీమ నేపథ్యంలో అరవింద స‌మేత‌ను తీసిన త్రివిక్రమ్‌, ఈసారి చేయబోయే చిత్రానికి అమెరికా నేపథ్యం ఎంచుకున్నారట. కుటుంబ విలువలతో పాటు పాశ్చాత్య అంశాలకు చిత్రకథలో త్రివిక్రమ్‌ చోటు కల్పించారట. ఇక వ‌చ్చే ఏడాదే ఈ చిత్రం సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నార‌ట‌. మొత్తానికి ఎన్టీఆర్ 30వ సినిమా విష‌యంలో త్రివిక్ర‌మ్ భారీ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు.

అమెరికాలో #ఎన్టీఆర్‌30.. భారీ ప్లాన్‌లో త్రివిక్ర‌మ్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts