ప‌వ‌న్‌ను హ‌ట్ చేసిన త్రివిక్ర‌మ్‌.. ఏం జ‌రిగిందంటే?

October 26, 2020 at 11:16 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు రాగా.. వాటిలో రెండు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈ కాంబినేషన్ మ‌ళ్లీ కుదురిందంటే మాత్రం పండగ చేసుకుంటారు ఫ్యాన్స్. ఎందుకంటే పవన్, త్రివిక్రమ్ మధ్య ఉన్న ర్యాపో అలాంటిది. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య హీరో-డైరెక్ట‌ర్ బంధ‌మే కాదు మంచి స్నేహితులు కూడా.

పవన్ కళ్యాణ్‌ను ఎప్పుడూ హీరోగా కాదు మంచి స్నేహితుడిగా చూస్తుంటాడు త్రివిక్రమ్. అయితే తాజాగా ఓ విష‌యంలో మాత్రం ప‌వ‌న్‌ను హ‌ట్ చేశాడ‌ట త్రివిక్ర‌మ్‌. విష‌యం ఏంటంటే.. మలయాళ సినిమా అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్‌లో ప‌వ‌న్ న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అయితే ముందు ఈ సినిమాకు త్రివిక్ర‌మ్‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌మ‌ని ప‌వ‌న్ కోరార‌ట‌. అందుకు త్రివిక్ర‌మ్ మాత్రం ఒప్పుకోలేద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ సినిమాను ప‌వ‌న్ దృష్టికి తీసుకెళ్లింది త్రివిక్ర‌మే. కానీ, డైరెక్ట్‌ చేయ‌డానికి మాత్రం నో చెప్పార‌ట‌. అందుకు కార‌ణం.. అప్ప‌టికే ఈ సినిమా స్క్రిప్టుపై సాగ‌ర్ చంద్ర చాలా వ‌ర్క్ చేశాడు. ప‌వ‌న్‌కి త‌గినట్టు క‌థ‌లో అన్ని మార్పులు కూడా చేశాడ‌ట‌. అలాంట‌ప్పుడు సాగ‌ర్‌ను ప‌క్క‌న పెట్ట‌డం బాగోదు. పైగా రీమేక్ క‌థ‌ల్ని తీయ‌డం త‌న‌కు ఇష్టంలేక నో చెప్పార‌ట‌.

ప‌వ‌న్‌ను హ‌ట్ చేసిన త్రివిక్ర‌మ్‌.. ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts