ట్రంప్ సలహాదారుపై చర్యలు.. ఎందుకో తెలుసా..?

October 19, 2020 at 7:10 pm

ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మాస్క్ వాడకం తప్పనిసరి గా మారిపోయిన విషయం తెలిసిందే. అటు ప్రభుత్వాలు కూడా ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్కు వాడాలి అని సూచిస్తున్నాయి . కానీ ఇక్కడ ఒక బాధ్యతాయుతమైన స్థానంలో కొనసాగుతూ కూడా మాస్క్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు పై ట్విట్టర్ చర్యలు తీసుకుంది. కరోనా వైరస్ నియంత్రణలో మాస్క్ పని చేయదు అంటూ ఇటీవల డోనాల్డ్ ట్రంప్ సలహాదారు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు.

ఈ పోస్టు పెట్టిన వెంటనే స్పందించిన ట్విట్టర్ ఇది తమ సంస్థ విధానానికి విరుద్ధంగా ఉంది అంటూ తెలిపింది. ఆ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలందరినీ తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి అంటూ భావించిన ట్విట్టర్ వెంటనే డోనాల్డ్ ట్రాంప్ సలహాదారు పెట్టిన పోస్ట్ తొలగిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతం ట్రంప్ సలహాదారు పెట్టిన ట్విట్టర్ తొలగించడం సంచలనంగా మారిపోయింది.

ట్రంప్ సలహాదారుపై చర్యలు.. ఎందుకో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts