
గత ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంతక వైరస్.. ప్రపంచదేశాలను ప్రజలను, ప్రభుత్వాలను ముప్పతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. సామాన్యులపైనే కాదు.. సెలబ్రెటీలు, క్రీడా కారులు రాజకీయ నాయకులు ఇలా అన్ని రంగాలకు చెందిన వారిపై కరోనా దాడి చేస్తోంది.
ఇక తాజాగా టిటిడిలో కరోనా కలవరం రేపింది. తిరుమలలోనూ పలువురు అర్చకులు, ఉద్యోగులు ఈ వైరస్ బారిన పడగా తాజాగా టిడిపి చైర్మన్ వైవి. సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైవి. సుభారెడ్డిక కరోనా సోకడంతో.. ఆయనను హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆయన ఆరోగ్యం నిలకడగానే వున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల నిర్వహించిన టీటీడీ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. దీంతో ఆయనను కలిసిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ నెల 12న వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ జన్మదినం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లోనూ వైవి. సుబ్బారెడ్డి పాల్గొని తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో ఇప్పుడు ఆయన తల్లికి మరియు కుటుంబసభ్యులందరికీ కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు.