టీటీడీ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల..?

October 27, 2020 at 2:53 pm

టీటీడీ సాధారణ దర్శనానికి అనుమతి ఇస్తూ టిటిడి బోర్డు కీలక నిర్ణయం తీసుకుని భక్తులందరికీ శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఇక రానున్న రోజుల్లో మరింత మంది భక్తులకు కూడా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తాము అంటూ ఇటీవల తెలిపింది. టిడిపి ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుని శ్రీవారి భక్తులందరికీ శుభవార్త తెలిపింది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసేందుకు టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రత్యేక ప్రవేశ దర్శనం నవంబర్ నెల కు గాను టీటీడీ 300 రూపాయల టికెట్లు తమ వెబ్సైట్లో విడుదల చేసింది. అయితే రోజుకు దాదాపు 19వేల టికెట్లు భక్తులందరికీ అందుబాటులో ఉంటాయని టీటీడీ బోర్డు తెలిపింది. ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ స్లాట్ లలో 19000 ప్లాట్లను కేటాయించేందుకు టిటిడి బోర్డు కసరత్తు చేస్తోంది. ఇక ప్రతి స్లాట్ కి కూడా వెయ్యి మంది భక్తులను ఉంచేందుకు టిటిడి బోర్డు నిర్ణయించగా ఎన్నో రోజుల నుంచి ప్రత్యేక దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులందరికీ శుభవార్త అని చెప్పాలి .

టీటీడీ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts