
టీవీ నటి మల్వి మల్హోత్రాపై కత్తితో దాడి చేయడం ఇప్పుడు సంచలనం సృష్టించింది. యోగేష్ మహిల్ పాల్ సింగ్ అనే వ్యక్తి కత్తితో ఆమె ఉదరం,చేతులపై దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది మల్వి. అక్కడున్న స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్టు సమాచారం.
ఒక ఏడాది నుండి ఇద్దరు మంచి ఫ్రెండ్స్‌గా ఉన్న సింగ్, మల్విల మధ్య ఇటీవల అనేక విభేదాలు తలెత్తాయి. దీంతో కొద్ది రోజులుగా మల్వి అతనితో మాట్లాడడం మానేసింది దూరంగా ఉంది. అతను పెళ్లి చేసుకుందామన్న కూడా రిజెక్ట్ చేసింది మల్వి. ఈ క్రమంలో ఆవేశంతో ఉన్న సింగ్.. కేఫ్ నుండి ఇంటికి వెళుతున్న మాల్విపై కత్తితో దాడి చేశాడు. ముంబైలోని వర్సోవా ఏరియాలో ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.