త్వరలో 20వేల పోలీసు నియామకాలు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..?

October 23, 2020 at 1:31 pm

ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది యువకులు పోలీసు ఉద్యోగంలో చేరి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు. ఇలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇటీవలే రాష్ట్ర పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 1162 మంది ఎస్ఐలు పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు.

కాగా ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహ్మద్ అలీ డీజీపీ మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోం మంత్రి మహ్మద్ అలీ నిరుద్యోగులు అందరికీ శుభవార్త తెలిపారు. ఇప్పటివరకు 18 వేలకు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నియామకం జరిపాము అంటూ తెలిపిన హోం మంత్రి మహమ్మద్ అలీ.. త్వరలోనే మరో 20 వేల పోలీస్ పోస్టులకు సంబంధించిన నియామక ప్రక్రియను మొదలు పెడతాము అంటూ తెలిపారు. ఇక పేదలందరికీ సమన్యాయం చేసే బాధ్యత పోలీసులపైనే ఉంటుందని… సమాజంలో మార్పు తీసుకురావడం కేవలం పోలీసుల తోనే సాధ్యం అవుతుందని ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి వ్యాఖ్యానించారు.

త్వరలో 20వేల పోలీసు నియామకాలు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts