జగన్ లేఖపై ఉండవల్లి తేల్చేసారు ..!

October 17, 2020 at 12:38 pm

సుప్రీం కోర్టు జడ్జీ రమణపై ఫిర్యాదు చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, సుప్రీం కోర్టు సి‌జే‌ఐ జస్టిస్ బాబ్డేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇక ఈ లేఖపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. జగన్ రాసిన లేఖ ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రచారం చేశారని,  కేంద్రం ఈ అంశాన్ని కట్టడి చేయాలనుకుంటే చేయొచ్చని చెప్పారు.

అయితే గతంలో ఎన్టీఆర్ కూడా ప్రజాసేవకు కోర్టులు అడ్డుపడుతున్నాయని భావించారని, కానీ ఆ తర్వాత కోర్టుల తీర్పుకు లోబడి ఎన్టీయార్ ప్రజాసేవ చేశారన్నారు. విదేశాల్లోలోగా మన దేశంలోనూ వర్చువల్ కోర్టులు ఏర్పాటు చేయాలని, ఏపీ ప్రజాప్రతినిధులకు సంబంధమున్న కేసులను వర్చువల్ కోర్టుల్లో విచారించాలని, వర్చువల్ కోర్టులపై తన సూచనలను సీజేకు మెయిల్ చేశానని తెలిపారు. అటు ముఖ్యమైన కేసుల్లో కోర్టు ప్రక్రియ లైవ్ టెలీకాస్ట్ చేయాలని, లైవ్ టెలీకాస్ట్ పద్ధతి విదేశాల్లో ఉందని ఉండవల్లి పేర్కొన్నారు.

జగన్ లేఖపై ఉండవల్లి తేల్చేసారు ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts