అన్‌లాక్ 5 మార్గ‌ద‌ర్శ‌కాల గడువు పెంపు..!

October 27, 2020 at 5:14 pm

కరోనా కారణంగా చాలా రోజుల వరకు దేశ ప్రజలు ఇంటికె పరిమితం అయ్యారు.ఆర్ధికంగా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. కోవిడ్ కారణంగా దేశంలో ఇప్పటికే ఐదు సార్లు లాక్ డౌన్ విధించింది. అయితే ఇప్పుడు అన్‌లాక్ 5 నిబంధ‌న‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం పొడిగించింది. ఆ మార్గ‌ద‌ర్శ‌కాలే వచ్చే నెల అంటే నవంబర్ 30వ తేదీ వ‌ర‌కు వ‌ర్తిస్తాయ‌ని ఇవాళ కేంద్ర హోంశాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. అయితే అంతకముందు వరకు సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్‌, స్పోర్ట్స్ ట్రైనింగ్ కేంద్రాల‌ను ష‌ర‌తుల‌తో ఓపెన్ చేసేందుకు సెప్టెంబ‌ర్ 30వ తేదీన కేంద్రం అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ న‌వంబ‌ర్ చివ‌రినాటి వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఇవాళ కేంద్రం హోంశాఖ స్ప‌ష్టం చేసింది.

వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న కంటేన్మెంట్ జోన్ల‌లో మాత్రం లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.ఇకపోతే సినిమా హాల్స్ విషయానికి వస్తే సినిమా థియేట‌ర్ల‌లో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తి ఇస్తూ సెప్టెంబ‌ర్ 30వ తేదీన కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందని తెలుసు.దీన్ని అదునుగా చేసుకుని కొన్ని రాష్ట్రాలు ఇప్ప‌టికే సినిమాహాళ్ల‌ను తెరిచాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలు మ‌త్రం థియేట‌ర్ల‌ను తెర‌వ‌లేదు.మరి ఇప్పుడు అక్టోబ‌ర్ నిబంధ‌న‌ల‌నే పొడిగించ‌డం వ‌ల్ల థియేట‌ర్ల యాజ‌మాన్యం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి మరి.. !!

అన్‌లాక్ 5 మార్గ‌ద‌ర్శ‌కాల గడువు పెంపు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts