యూపీలో మరో దారుణ ఘటన.. రేప్ చేసి గొంతు కోసి..?

October 16, 2020 at 6:00 pm

ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ఆడపిల్లలపై జరుగుతున్న దారుణ అత్యాచార హత్య ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ ఘటన మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 18 సంవత్సరాల యువతి పై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన గుర్తుతెలియని యువకులు చివరికి గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బారాబంకి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.

ఉదయం సమయంలో పొలం పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పొలానికి వెళ్లి చూడగా రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించింది కూతురు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం లో యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైద్యులు తెలిపారు. ఘటన స్థానికులను అని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసుకుంది.

యూపీలో మరో దారుణ ఘటన.. రేప్ చేసి గొంతు కోసి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts