ఉప ఎన్నిక ప్రచార రంగంలోకి కేసిఆర్..?

October 24, 2020 at 3:48 pm

దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయిన విషయం తెలిసిందే. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల దృష్టి మొత్తం దుబ్బాక ఉప ఎన్నికలపై ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి అధికార పార్టీ భారీ షాక్ ఇవ్వడానికి ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదులుతున్నాయి. ఈసారి తప్పక టిఆర్ఎస్ దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తుంది అని అధికార పార్టీ ధీమాతో ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ టిఆర్ఎస్ పార్టీ రంగంలోకి దింపి ముమ్మర ప్రచారం చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇక త్వరలో దుబ్బాక ఎన్నికల ప్రచార రంగంలోకి సీఎం కేసీఆర్ కూడా రానున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. దుబ్బాక ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎంతో మంది టికెట్ ఆశించి భంగపడిన వారి నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతున్న తరుణంలో ఈ నెల 30, 31 లోపు ఎన్నికల ప్రచార రంగంలోకి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఉప ఎన్నిక ప్రచార రంగంలోకి కేసిఆర్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts