అలాంటి వారు దేవికి పూజ‌లు చేయొద్దు.. ఉపాసన షాకింగ్ కామెంట్స్‌?

October 24, 2020 at 10:19 am

మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసన కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యువ పారిశ్రామికవేత్తగా, అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌గా, సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా తనకంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఏర్ప‌ర్చుకుంది ఉపాస‌న‌. అలాగే ఆరోగ్యంపై, బెస్ట్ పుడ్‌పై ఎప్ప‌టిక‌ప్పుడు సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తుంటుంది.

ఇక నిరుద్యోగులకు తన అపోలో హెల్త్ గ్రూప్‌‌లో ఏమైనా ఖాళీలు ఉంటే అప్లై చేసుకోమంటూ.. ఉద్యోగాలు కల్పిస్తూ కూడా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే ఉపాస‌న‌.. తాజాగా ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ వ‌చ్చింది. ఆ ఇంట‌ర్వ్యూకు సంబంధించిన ప్రోమో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అందులో ఉపాస‌న‌ ఆస‌క్తిక‌ర విషయాల‌ను పంచుకుంది. ప్రతి ఇంట్లో మహిళలను గౌరవించాలని, మహిళలను గౌరవించని ఇంట్లో దేవికి కూడా ప్రార్థనలు చేయొద్దని ఉపాసన అన్నారు. అంతేకాదు పూజ నుంచి దేవి ఫొటోలను తీసేయాలని సూచించారు. అలాగే మ‌రిన్ని విష‌యాలు కూడా ఈ ఇంట‌ర్వ్యూలో ఉపాస‌న తెలిపారు.

అలాంటి వారు దేవికి పూజ‌లు చేయొద్దు.. ఉపాసన షాకింగ్ కామెంట్స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts