రాజ్‌త‌రుణ్‌కు పోలీసులు బిగ్‌ షాక్.. ఏం జ‌రిగిందంటే?

October 17, 2020 at 2:11 pm

రాజ్‌త‌రుణ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్‌ విజయాలు అందుకుపి మంచి పేరు సంపాదించుకున్న‌ ఈయ‌న‌.. గత రెండు, మూడేళ్లుగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఇక ఇటీవ‌ల ఓటీటీ వేదిక‌గా `ఒరేయ్.. బుజ్జిగా` అంటూ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన రాజ్ త‌రుణ్ మ‌ళ్లీ విఫ‌ల‌మ‌య్యారు.

ఇక ప్ర‌స్తుతం రాజ్‌తరుణ్ వనమాలి క్రియేషన్స్‌ బ్యానర్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా విష‌యంలో రాజ్ త‌రుణ్‌కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్‌లు కేవలం స్టుడియోల్లో మాత్రమే జరుగుతున్నాయి. ఒకవేళ పబ్లిక్ ప్రాంతాల్లో షూటింగులు చేసుకోవాలంటే అనుమ‌తి తీసుకోవాలి.

అయితే రాజ్‌త‌రుణ్ తాజా సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉప్పల్‌లోని బ్యాంక్ కాలనీలో జరుగుతోంది. కానీ, ఇందుకుగాను యూనిట్ స్టానిక పోలీసుల అనుమతి తీసుకోలేదట. ఈ విషయం తెలుసుకున్న ఉప్పల్ పోలీసులు వెంటనే అక్క‌డ‌కు చేరుకుని షూటింగ్ నిలిపివేశారు. అనంత‌రం పబ్లిక్ ప్లేస్‌లో షూటింగ్ నిర్వహించినందుకు కేసు న‌మోదు చేశారు.

రాజ్‌త‌రుణ్‌కు పోలీసులు బిగ్‌ షాక్.. ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts