వైద్యం పేరుతో బాలికపై డాక్టర్ అత్యాచారం..?

October 13, 2020 at 3:12 pm

ఆడపిల్లలపై రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. బాధ్యతగా ఉండాల్సిన వారే ఓడిపోదు మహిళలపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు.దీంతో రోజురోజుకు మహిళల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది . ఇక్కడ ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది వైద్యం చేయాల్సిన వైద్యుడు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి బాలికపై కామంతో ఊగిపోయాడు. చివరికి బాలికకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడు.

కడుపు నొప్పితో బాధ పడిన బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయటపడింది. దీంతో వైద్యం పేరుతో బాలికల లొంగ తీసుకుని అత్యాచారం చేసిన వైద్యుడి తీరుతో ఆగ్రహించిన స్థానిక మహిళలందరూ నిందితుని చితకబాదారు. చెప్పులు కర్రలతో దేహశుద్ధి చేశారు. అంతలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన నిజాంబాద్ లో వెలుగులోకి వచ్చింది.

వైద్యం పేరుతో బాలికపై డాక్టర్ అత్యాచారం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts