వైద్యుడి నిర్వాకం.. కడుపులో కత్తెర.. చివరికి..?

October 15, 2020 at 3:58 pm

ఎలాంటి రోగాలు వచ్చినా చికిత్స అందించి ప్రాణాలు కాపాడే వైద్యులు ప్రత్యక్ష దైవం అని చెబుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఏకంగా వైద్యుల నిర్లక్ష్యం ప్రాణాల మీదికి తెస్తూ ఉంటుంది. ఇలా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యంతో రోగుల ప్రాణాలు మీదకు వస్తున్న ఘటనలు రోజురోజుకీ తెరమీదికి వస్తూనే ఉన్నాయి ఇటీవలే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం పై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏకంగా రోగికి ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులోనే కత్తెర మరిచిపోయిన ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. రాజా అనే 55 ఏళ్ల వ్యక్తి అల్సర్ తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే చికిత్స నిమిత్తం అతనిని ఆరు నెలల క్రితం కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత ఆపరేషన్ చేసిన వైద్యులు కొన్ని రోజుల తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేశారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత క్రమక్రమంగా కడుపునొప్పి రావడం మొదలైంది. ఇక రోజు రోజుకి కడుపునొప్పి మరింత తీవ్రతరం అవుతూ వచ్చింది. దీంతో మళ్లీ రాజాను ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా స్కానింగ్ చేసి చూసిన వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు. రాజా అనే వ్యక్తి కి ఆపరేషన్ చేస్తూ కడుపులో కత్తెర మర్చిపోయారు వైద్యులు. వైద్యుల నిర్లక్ష్యంపై ప్రస్తుతం ఎన్నో విమర్శలు వస్తున్నాయి.

వైద్యుడి నిర్వాకం.. కడుపులో కత్తెర.. చివరికి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts