వైరల్ వీడియో.. కారే విమానం అయ్యింది..?

October 31, 2020 at 4:24 pm

ఇప్పుడు వరకు ప్రతి ఒక్కరూ భూమి మీద నడిచే కారు చూసే ఉంటారు. కొన్నిసార్లు భూమి మీద నడుస్తూ నీటి లోకి వెళ్ళగానే పడవ గా మారిపోయిన కార్లను కూడా చూసే ఉంటారు. కానీ భూమ్మీద పరుగులు పెడుతూనే నిమిషాల వ్యవధిలో విమానం గా మారిపోయి గాల్లోకి ఎగిరి దూసుకుపోయే కారు మాత్రం ఇప్పటివరకు దాదాపుగా ఎవరూ చూసుండరు. సినిమాల్లో అయితే చెప్పలేము కానీ నిజజీవితంలో మాత్రం ఇలాంటి కారుని ఎవరూ చూసి ఉండరు.

అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా ఇలాంటి సరికొత్త కార్ కళ్ళ ముందుకు వచ్చేసింది. ఏకంగా భూమిమీద హై స్పీడ్ తో దూసుకుపోతున్న కార్ నిమిషాల వ్యవధిలోనే విమానంలా గాల్లోకి ఎగురుతుంది ఇక్కడ ఒక కారు. ఐరోపాలోని స్లోవేకియా దేశం కు చెందిన ఓ కార్ల తయారీ సంస్థ ఈ సరికొత్త ఆవిష్కరణ రూపొందించింది. దాదాపు ముప్పై సంవత్సరాలు కష్టపడి ఈ కారు తయారు చేసింది క్లెయిన్ విజన్ అనే సంస్థ. ఇక ఈ కారు 11 వందల కిలోల బరువు ఉండగా రెండు వందల కిలోల వరకు బరువు మోయాకలుగుతుంది.

వైరల్ వీడియో.. కారే విమానం అయ్యింది..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts