ఎట్ట‌కేల‌కు ఓటీటీనే న‌మ్ముకున్న మెగా మేన‌ల్లుడు?

October 26, 2020 at 8:50 am

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్ డెబ్యూ మూవీ `ఉప్పెన‌`. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ స‌ర‌స‌న కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్ కథ అందిస్తుండగా.. శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీ రోల్ పోషించడంతో తమిళ్‌లో కూడా సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నవీన్ ఎర్నేని, రవిశంకర్‌లు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తయి విడుదలకు సిద్ధమైన తరుణంలో లాక్ డౌన్ రావడంతో థియేటర్లు మూతబడ్డాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఓటీటీ నుంచి భారీ ఆఫ‌ర్లు వ‌చ్చినా.. ద‌ర్శ‌క‌నిర్మాతలు ఇవ్వలేదు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా త్వ‌ర‌లోనే ఓటిటీలో రిలీజ్ కాబోతుందని తెలుస్తోందని. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని టాక్‌. ఈ సినిమాకి సదరు ఓటిటి సంస్థ భారీ మొత్తం ఆఫర్ చేస్తుండ‌డంతో.. ఉప్పెన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ట‌.

Uppena Movie Wiki, Review, Cast, Crew, Trailer, Release Date - Say Cinema

ఎట్ట‌కేల‌కు ఓటీటీనే న‌మ్ముకున్న మెగా మేన‌ల్లుడు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts