ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా!

October 24, 2020 at 11:22 am

గ‌త ఏడాది ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాలకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే క‌రోనా కాటుకు ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్ర‌పంచ‌వ్యాప్తంగా నాలుగు కోట్ల‌కు పైగా మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు, రాజ‌కీయ‌నాయ‌కులుపై సైతం ఈ మాయ‌దారి క‌రోనా వ‌దిలిపెట్ట‌డం లేదు.

తాజాగా తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి క‌రోనా సోకింది. ఆయ‌న‌కు స్వల్ప లక్షణాలు కనిపించడంతో శనివారం కరోనా టెస్టులు చేసుకున్నారు. ఈ టెస్టుల్లో వంశీకి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీనితో 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు వంశీకి సూచించారు.

ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉన్న‌ట్టు స‌మాచారం. వంశీకి క‌రోనా సోక‌డంతో.. ప్ర‌స్తుతం ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా క‌రోనా టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌త వారం రోజులుగా వంశీని క‌లిసిన వారంద‌రూ క‌రోనా టెస్ట్‌లు చేయించుకోవాల‌ని వైద్యులు సూచించారు.

ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts