వామ్మో.. ముద్దు విలువ.. ఏడు నెలల జైలు శిక్ష..?

October 21, 2020 at 6:04 pm

ముద్దు ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాన్ని బలపరచడమే కాదు ఎంతో దగ్గర చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇష్టం లేకుండా పెట్టే ముద్దు మాత్రం లైంగిక వేధింపుల కింద కే వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది ఒక బాలికకు ఇష్టం లేకుండా యువకుడు ముద్దు పెట్టబోతే ఏకంగా చివరికి ఏడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఈ ఘటన సింగపూర్ లో చోటు చేసుకున్నది. సింగపూర్లో మహిళల రక్షణ కోసం కఠిన శిక్షలు విధిస్తూ ఉంటారు అన్న విషయం తెలుస్తుంది.

అయితే ఇటీవలే సింగపూర్ లో నివసించే భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి కి గత ఏడాది సోషల్ మీడియా వేదికగా ఒక బాలిక పరిచయమైంది. పలుమార్లు ఇద్దరు కలుసుకున్నారు కూడా. ఇక ఈ క్రమంలోనే ఓ రోజు బాలిక తన స్నేహితుల కోసం మద్యం తీసుకు రావాలి అంటూ యువకున్ని కోరింది. బాలిక కోరిక మేరకు మద్యం తీసుకొని వచ్చిన సదరు యువకుడు… అదే సమయంలో బాలికను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ బాలిక ఒప్పుకోకపోవడంతో లైంగిక దాడికి ప్రయత్నం చేసాడు. దీనిపై మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏకంగా ఏడు నెలల జైలు శిక్ష విధించింది కోర్టు .

వామ్మో.. ముద్దు విలువ.. ఏడు నెలల జైలు శిక్ష..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts