మూడో భ‌ర్త‌ను గెంటేసిన నటి వనిత‌.. ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌?

October 19, 2020 at 3:58 pm

ప్రముఖ నటి, బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్‌ వనితా విజయ్‌కుమార్ ఇటీవ‌ల పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు భర్తలతో విడిపోయిన వనిత ఈ ఏడాది ముచ్చటగా మూడో వివాహం చేసుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు సైతం వ‌నిత‌ను విమ‌ర్శించారు. దీంతో వనిత కూడా వారిపై ఎదురుదాడి చేసింది.

ఈ వ్యవహారం కేసులు, కోర్టు వరకు దారి తీసింది. అయితే తాజాగా మూడో భ‌ర్త‌ను పీట‌ర్ పాల్‌ను వ‌నిత ఇంటి నుంచి గెంటేసింద‌ట‌. ఇటీవ‌ల పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ కోసం వనితా, పీటర్‌లు పిల్లలను తీసుకొని గోవా ట్రిప్‌కి వెళ్లి వచ్చారు. తన గోవా టూర్ కి సంబందించిన ఫోటోలు వనితా సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. గోవా ట్రిప్‌లో అధిక మద్యాన్ని సేవించిన పీటర్‌.. వనితాతో అసభ్యంగా ప్రవర్తించారట.

దీంతో ఆమె, అతడిని కొట్టిందట. ఇక చెన్నైకి వచ్చిన తరువాత కూడా పీటర్‌ మద్యం మత్తులో ఉండటంతో అతడిని ఇంటి నుంచి గెంటేసిందట. ప్ర‌స్తుతం ఈ విష‌యం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించాడు. ఇల్లీగల్‌ మ్యారేజ్‌కి వ్యతిరేకంగా చాలా మంది కోరుకున్న కోరిక నెరవేరింది. పీపీ(పీటర్ పాల్‌)ని తన్ని తరిమేశారు అని ర‌వీంద‌ర్ పోస్ట్ పెట్టారు. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే వ‌నిత స్పందించాల్సిందే.

మూడో భ‌ర్త‌ను గెంటేసిన నటి వనిత‌.. ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts