డైరెక్టర్‌గా మారిన స్టార్ హీరో కూతురు.. స‌క్సెస్ అయ్యేనా?

October 19, 2020 at 9:54 am

త‌మ‌ళ స్టార్ హీరో శరత్ కుమార్ గారాల పట్టి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోయిన్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గా మెప్పించిన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్.. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే చెప్పే వరలక్ష్మి ప్ర‌స్తుతం మెగాఫోన్‌ పడుతోంది.

Varalakshmi Sarathkumar comments on Radhika

‘కన్నామూచ్చి’ అనే తమిళ సినిమాతో ఆమె డైరెక్టర్‌గా మారబోతోంది. కన్నామూచ్చి అంటే తెలుగులో దాగుడుమూతలు అని అర్థం. లేడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను తేనాండల్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించనుంది. వరలక్ష్మి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ.. నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Image

తాజాగా విడుదల చేసిన కన్నామూచి ఫస్ట్‌లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మ‌రియు న‌టిగా స‌క్సెస్ అయిన వ‌ర‌ల‌క్ష్మి.. డైరెక్ట‌ర్‌గా ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి. కాగా, వరలక్ష్మీ ప్రస్తుతం తెలుగులో `క్రాక్‌`, `నాంది`, `అద్దం` చిత్రాల్లో నటిస్తుండగా, తమిళంలో ఏడు సినిమాలు, కన్నడలో ఓ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తోంది.

డైరెక్టర్‌గా మారిన స్టార్ హీరో కూతురు.. స‌క్సెస్ అయ్యేనా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts