మ‌రోసారి పాఠాలు చెప్ప‌నున్న వెంకీ..!

October 19, 2020 at 3:21 pm

తెలుగు చిత్ర‌సీమ‌లో అత్య‌ధిక సినిమాలు స‌క్సెస్ సాధించిన హీరోల్లో వెంకటేష్ ముందు వ‌రుస‌లో ఉంటారు. అందుకే విక్ట‌రీగా పేరును సంపాదించారు. సినిమా క‌థ‌ల ఎంపిక‌లో చాలా ఆచితూచి ముందుకు సాగుతుంటా వెంకీ. ఒక జోన‌ర్ సినిమా చేసిన త‌రువాత మ‌రో జోన‌ర్ క‌థ‌ను ఎంచుకుంటుంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటార‌ని సినీజ‌నాల అభిప్రాయం. యువ‌త‌రం హీరోలు వ‌చ్చినా వెంకీ మాత్రం త‌న జోరును కొన‌సాగిస్తున్నారు. వ‌య‌స్సుకు త‌గ్గ పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ఔరా అనిపిస్తున్నారు. వెంక‌టేశ్ చేసిన‌ గత మూడు సినిమాలు కూడా మంచి విజయమే సాధించాయి. గురు, ఆ తర్వాత చేసిన ఎఫ్ 2 గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక గత డిసెంబర్‌లో విడుదలైన వెంకీ మామ కూడా పర్లేదనిపించింది. ప్ర‌స్తుతం వెంకీ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల దర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న తమిళ సినిమా అసురన్ రీమేక్ నారప్పతో బిజీగా ఉన్నారు. ఆ మూవీతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

అందులో ప్ర‌ధానంగా పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి యూత్ ఫుల్ సినిమాలతో స‌త్తా చాటిన‌ కుర్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ వెంకీ కోసం కథ సిద్ధం చేశాడ‌ట‌. వెంకీని కొత్త తరహాలో చూప‌నున‌ట్లు టాలివుడ్ వ‌ర్గాల టాక్‌. చాలా రోజులుగా ఈ ప్రాజెక్టుపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నా ఎలాంటి వార్తలు రాలేదు. ఇప్పుడు దీనిపై ఫుల్ కన్ఫర్మేషన్ వచ్చేసింద‌ని తెలుస్తున్న‌ది. సొంత బ్యాన‌ర్‌ సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ట్లు స‌మాచారం. మూవీ పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ నేపథ్యంలోనే ఉండబోతుంద‌ట‌. ఇందులో వెంకటేష్ లెక్చరర్‌గా నటించబోతున్నాడుట‌. కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా సుందరాకాండ తరహాలోనే ఫుల్ కామెడీగా ఉండబోతుందని, అక్కడక్కడా సీరియస్ కథ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రంపై పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. వచ్చే ఏడాది షూటింగ్ మొదలు పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది. అయితే వెంకీ మ‌రోసారి పాఠాలు చెప్ప‌డానికి సిద్ధం అవుతండ‌డంతో అభిమానులు ఆనందానికి అవ‌ధుల్లేకుండా ఉన్నాయి.

మ‌రోసారి పాఠాలు చెప్ప‌నున్న వెంకీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts