లెక్చరర్‌గా మార‌బోతున్న వెంకటేష్‌.. దేనికో తెలుసా?

October 28, 2020 at 12:26 pm

విక్టరీ వెంకటేష్.. త్వ‌ర‌లోనే లెక్చ‌ర‌ర్‌గా మార‌బోతున్నాడు. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లోనే. ప్ర‌స్తుతం వెంకీ శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో `నార‌ప్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ ఫిలిం ‘అసురన్’కు ఇది రీమేక్. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌లో సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం త‌ర్వాత వెంక‌టేష్ ఎఫ్‌3లో న‌టించ‌నున్నాడు. అలాగే ‘పెళ్లిచూపులు’ చిత్రంతో ఇండస్ట్రీని తనవైపు చూసేలా చేసిన దర్శకుడు తరుణ్‌ భాస్కర్ తో ఓ సినిమా చేసేందుకు వెంకీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. ఈ చిత్రం కూడా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జ‌రుగుతున్నాయి.

ఈ సినిమా గుర్రపు పందేల బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఇక‌ ఈ సినిమాలో వెంకటేశ్‌ లెక్చరర్‌ పాత్రలో కనిపిస్తారన్నది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ సమాచారం. ఆయన లెక్చరర్‌గా కనిపించే పోర్షన్‌ మొత్తం ఎంతో వినోదాత్మకంగా ఉంటుందట. కాగా, గ‌తంలో వెంకటేష్‌ సుందరాకాండలో లెక్చరర్‌గా క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు మ‌రోసారి లెక్చరర్‌గా మార‌బోతున్న వెంకటేష్.

లెక్చరర్‌గా మార‌బోతున్న వెంకటేష్‌.. దేనికో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts